: తార్నాక పెట్రోల్ బంక్ పై ఓయూ విద్యార్థుల దాడి
హైదరాబాద్ తార్నాక క్రాస్ రోడ్స్ లోని పెట్రోల్ బంక్ పై ఏబీవీపీ ఆధ్వర్యంలో ఓయూ విద్యార్థులు దాడికి పాల్పడ్డారు. ఈ సమయంలో అక్కడి ఫర్నిచర్ ను ధ్వంసం చేశారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు విద్యార్థులను అరెస్టు చేశారు. బంకు కోసం తీసుకున్న భూమి లీజును రద్దుచేయాలని, భూములు వెనక్కివ్వాలని డిమాండ్ చేశారు. వర్సిటీ భూమిని ఆక్రమించి ఇక్కడ బంక్ ఏర్పాటు చేశారని విద్యార్థులు ఆరోపించారు. విశ్వవిద్యాలయ భూములు చాలావరకు ఇలాగే ఆక్రమణకు గురయ్యాయని మండిపడ్డారు. ఓయూ భూముల్లో పేదలకు ఇళ్లు నిర్మిస్తామన్న సీఎం కేసీఆర్ ప్రకటనకు వ్యతిరేకంగా కొన్ని రోజుల నుంచి విద్యార్థులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా నిన్న (సోమవారం) తార్నాకలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి చెందిన స్వాగత్ హోటల్ పై దాడిచేశారు. నేడు పెట్రోల్ బంక్ పై దాడి చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం తన నిర్ణయం మార్చుకోవాలని, లేకుంటే ఆందోళనలను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.