: పోలీసు అధికారిని కొట్టి చంపారు


మీరు చేస్తున్నది తప్పు అని చెప్పడమే ఆ అధికారి చేసిన తప్పిదం. అది ఆ అధికారి ప్రాణాలనే బలిగొంది. వివరాల్లోకి వెళ్తే, పశ్చిమ బెంగాల్ లోని మాల్దా జిల్లాలో, ఓ రైల్వే స్టేషన్ ప్రవేశ ద్వారం వద్ద ఓ వ్యక్తి ఏవో పదార్థాలు అమ్ముతున్నాడు. దీంతో, ఎస్.సమంత అనే రైల్వే పోలీస్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) అధికారి... పదార్థాలు అమ్ముతున్న వ్యక్తి వద్దకు వెళ్లి... ఇక్కడ అమ్మకూడదు, వెళ్లిపోవాలని సూచించాడు. దీనికి నిరాకరించిన ఆ వ్యక్తి పోలీసు అధికారితో వాదనకు దిగి, చేయి కూడా చేసుకున్నాడు. అతడికి తినుబండారాలు అమ్ముతున్న చుట్టుపక్కల వారు కూడా తోడయ్యారు. అంతా కలసి ఆర్పీఎఫ్ స్టేషన్ పై దాడి చేశారు. అనంతరం ఆ అధికారిని బయటకు లాగి పిడిగుద్దులు కురిపించారు. రాళ్లతో కొట్టి చంపేశారు. ఈ ఘటన సంచలనం రేపుతోంది.

  • Loading...

More Telugu News