: అమరావతికి వచ్చిన తొలి సాఫ్ట్‌వేర్‌ కంపెనీ


నవ్యాంధ్ర రాజధాని అమరావతికి తొలి సాఫ్ట్ వేర్ కంపెనీ వచ్చేసింది. మంగళగిరి సమీపంలోని ఏపీఐఐసీ భూముల్లో ‘పై డాటా సెంటర్‌’కు 10 ఎకరాలు కేటాయిస్తూ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ భూమిని ఏడాదికి రూ. 1 కోటి అద్దె చెల్లించేలా 33 సంవత్సరాల పాటు లీజుకు ఇస్తున్నట్టు నిబంధనల్లో పేర్కొన్నారు. కాగా, సుమారు రూ. 600 కోట్ల ఖర్చుతో ఈ ప్రాజెక్టును స్థాపిస్తున్నామని, తొలి దశలో 300 మందికి ప్రత్యక్షంగా, మరో 2 వేల మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుందని ‘పై డాటా సెంటర్‌’ అధికారులు వెల్లడించారు. కాగా, అమరావతి ప్రాంతానికి వచ్చేందుకు మరిన్ని ఐటీ సంస్థలు ఆసక్తిని చూపుతున్నాయని అధికారులు వెల్లడించారు.

  • Loading...

More Telugu News