: యూకే ఎన్నికల్లో నిర్ణయాత్మక పాత్ర భారత సంతతి ఓటర్లదేనట!
బ్రిటన్ ప్రధానిగా డేవిడ్ కామెరాన్ మరోసారి ఎన్నికవడంలో భారత సంతతి ఓటర్లది నిర్ణయాత్మక పాత్ర అని ఓ సర్వే చెబుతోంది. బ్రిటీష్ ఫ్యూచర్ అనే సంస్థ ఈ సర్వే చేపట్టింది. ఇటీవలే యూకేలో ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీ విజయం సాధించింది. ఆ విజయంలో మైనారిటీ వర్గాల ఓట్లు కీలకంగా మారాయని సర్వేలో వెల్లడైంది. కాగా, దాదాపు 6,15,000 మంది భారత సంతతి ఓటర్లు పోలింగ్ లో పాల్గొన్నట్టు అంచనా వేశారు. వారిలో అత్యధికులు విపక్ష లేబర్ పార్టీని కాదని, కన్జర్వేటివ్ పార్టీకి ఓటేసినట్టు సర్వే పేర్కొంది.