: ఏపీ రాజధానిపై బీజేపీ జాతీయ కార్యదర్శి తీవ్ర వ్యాఖ్యలు
ఏపీ రాజధాని నిర్మాణం రైతుల సమాధులపై చేపట్టడం సరికాదంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు బీజేపీ జాతీయ కార్యదర్శి మురళీధర్ రావు. అందరికీ ఆమోదయోగ్యమైన రాజధాని అయితేనే బీజేపీ సాయం చేస్తుందని, రైతులను ఇబ్బందులకు గురిచేస్తూ రాజధాని నిర్మించాలని చూస్తే బీజేపీ ఎట్టి పరిస్థితుల్లోనూ సహకరించదని స్పష్టం చేశారు. సింగపూర్ మంత్రి నుంచి రాజధాని నిర్మాణానికి మాస్టర్ ప్లాన్ అందుకున్న ఏపీ సర్కారును ఈ వ్యాఖ్యలు ఇబ్బంది పెట్టేవే. రాజధాని నిర్మాణం కోసం చంద్రబాబు ప్రభుత్వం భారీగా వెచ్చించనుంది. రాజధాని నిర్మాణం కోసం చేపట్టిన భూసేకరణ ప్రక్రియపై విమర్శలు రావడం తెలిసిందే.