: రాజధాని నిర్మాణంలో సింగపూర్ ప్రభుత్వం పని చేస్తుందో, లేదో ఇప్పుడే చెప్పడం సాధ్యం కాదు: ఈశ్వరన్


తాము బ్లూప్రింట్ ఇచ్చామని, దీనికి అనుగుణంగా డెవెలప్ చేయాలని, ఆ తరువాత నిర్మాణం జరుగుతుందని సింగపూర్ పరిశ్రమల శాఖ మంత్రి ఈశ్వరన్ తెలిపారు. రాజధాని నిర్మాణంలో సింగపూర్ ప్రభుత్వం పాలు పంచుకుంటుందా? అనే ప్రశ్నకు సమాధానంగా ఆయన రాజధాని నిర్మాణానికి నిబంధనలు అనుమతిస్తే, అందుకు అనుగుణంగా పని చేయడానికి అభ్యంతరం లేదని అన్నారు. అయితే దానికి టెండర్లు పిలవడం, బిడ్లు వేయడం, అందులో నిలదొక్కుకోవడం వంటి చాలా కసరత్తు ఉందని ఆయన చెప్పారు. రాజధాని నిర్మాణంలో సింగపూర్ పాలుపంచుకునే అవకాశం వస్తే పని చేయడానికి అభ్యంతరం లేదని ఆయన స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News