: రాజధాని మీదుగా ప్రవహించే నది ఆంధ్రప్రదేశ్ కు కీలకం కానుంది


ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నగరం నడిబొడ్డు నుంచి 35 కిలోమీటర్ల మేర ప్రవహించే నది మార్గం ఎంతో ప్రయోజనకారి కానుందని సుర్బానా ఇంటర్నేషనల్ సిఈఓ వెల్లడించారు. కేవలం రోడ్డు, రైలు మార్గాలనే కాకుండా, జలరవాణా మార్గంగా కూడా నది ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు. ఇది పర్యాటకానికి కూడా ఎంతో ఉపయోగపడుతుందని ఆయన చెప్పారు. అలాగే రాజధానిలో క్రికెట్ స్టేడియం, యూనివర్సిటీ, సెంట్రల్ పార్క్ ఉండనున్నాయి. భవానీ ద్వీపం ప్రముఖ పర్యాటక ప్రాంతంగా విరాజిల్లనుందని ఆయన వెల్లడించారు. అలాగే విజయవాడలోని దుర్గ గుడి, మంగళగిరి, తుళ్లూరు, కొండవీటి గుహలను కలుపుతూ మెట్రో రైలు మార్గాలు రానున్నాయని ఆయన వివరించారు. సీడ్ క్యాపిటల్ ప్లాన్ ను జూలైలో ఇవ్వనున్నట్టు ఆయన చెప్పారు.

  • Loading...

More Telugu News