: మహానాడు ఏర్పాట్లను పరిశీలిస్తూ గాయపడిన ఎమ్మెల్సీ వీవీవీ చౌదరి
టీడీపీ మహానాడు ఏర్పాట్లలో అపశ్రుతి చోటుచేసుకుంది. హైదరాబాదులోని గండిపేటలో మహానాడు నిర్వహించేందుకు తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. అందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే, ఏర్పాట్లను పరిశీలిస్తున్న ఎమ్మెల్సీ వీవీవీ చౌదరి ఓ తాడు కాళ్లకు చుట్టుకోవడంతో కిందపడిపోయారు. దీంతో, ఆయన కాలికి గాయం కాగా, వెంటనే ఆసుపత్రికి తరలించారు. కాగా, మహానాడుకు వచ్చే పార్టీ శ్రేణుల కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం పదెకరాల విస్తీర్ణంలో సూపర్ షామియానాలు వేస్తున్నారు. ఎండవేడిమి నుంచి ఉపశమనం కోసం కూలర్లు, నీటిని చిలకరించే స్ప్రింక్లర్లు సిద్ధం చేస్తున్నారు. ఎండాకాలం కావడంతో ద్రవ రూప ఆహార పదార్థాలకు ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించారు.