: ప్రతి 20 సెకెన్లకోసారి పెద్దగా ఊపిరి తీసుకోవాల్సి వస్తోంది: అమీర్ ఖాన్


బాలీవుడ్ మిస్టర్ పర్ ఫెక్ట్ అమీర్ ఖాన్ ఏది చేసినా నూటికి నూరుశాతం కష్టపడి చేయాలంటాడు. అందుకే అతని సినిమాలు రికార్డులు సాధిస్తాయి. 'పీకే' తరువాత ఆయన కొత్త ప్రాజెక్టు ఓకే చేశాడు. ఈ ప్రాజెక్టు కోసం అమీర్ ఖాన్ బరువు పెరిగాడు. యువకుడిలా కనిపించే అమీర్ బొద్దుగా మారాడు. బరువు 95 కేజీలకు చేరుకోవడంతో షూలేస్ కట్టుకోవాలన్నా ఇబ్బందిగా ఉందట. అంతేకాదు, ప్రతి 20 సెకెన్లకోసారి పెద్దగా ఊపిరి తీసుకోవాల్సి వస్తోందని అమీర్ వాపోయాడు. అయితే ఇలా సినిమా సినిమాకీ బరువులో మార్పుల వల్ల ఆరోగ్యంపై ప్రభావం పడుతుందని తన తల్లి, భార్య ఆందోళన చెందుతున్నారని అమీర్ వెల్లడించాడు. అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, మరో ఐదు నెలల్లో 'పీకే'లోలా యవ్వనంలో తొణికిసలాడిన రూపంతో కనిపిస్తానని అమీర్ ఖాన్ అభిమానులకు భరోసా ఇచ్చాడు.

  • Loading...

More Telugu News