: డాక్టర్ నిర్లక్ష్యానికి 8 లక్షల జరిమానా


వైద్యులకు నిర్లక్ష్యం పెరిగిపోతోంది. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల వైద్యులు, ఆపరేషన్ చేసి రోగుల శరీరాల్లో కత్తెర్లు, కత్తులు, కాటన్, మొబైల్ ఫోన్లు మర్చిపోయి కుట్లు వేసేయడం సర్వసాధారణంగా మారింది. బాధితులు మరింత బాధతో ఆసుపత్రుల చుట్టూ తిరగడం, వారు గతంలో ఆపరేషన్ చేసిన వైద్యుల నిర్వాకం బయటపెట్టడం మామూలైపోయింది. ఇలాంటి ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన గుజరాత్ వినియోగదారుల కమిషన్ సంచలన తీర్పునిచ్చింది. 12 ఏళ్ల క్రితం జరిగిన ఆపరేషన్ సమయంలో కడుపులో కాటన్ మర్చిపోయి కుట్లు వేసేసిన మహిళా డాక్టర్ వందన (గైనకాలజిస్ట్) పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, బాధితురాలికి 8 లక్షల రూపాయల నష్ట పరిహారం, కోర్టు ఖర్చుల నిమిత్తం 10 వేల రూపాయలు చెల్లించాల్సిందిగా ఆమెను, ఆసుపత్రికి బీమా సౌకర్యం కల్పిచిన బీమా కంపెనీని ఆదేశించింది. ఈ తీర్పుపై డాక్టర్ వందన, బీమా సంస్థలు వినియోగదారుల వివాదాల రిడ్రెసల్ కమిషన్ను ఆశ్రయించారు. వారి పిటిషన్ ను విచారించిన రిడ్రెసల్ కమిషన్, కింది కోర్టు తీర్పును అభినందిస్తూ, ఆపరేషన్ సమయంలో అన్నీ జాగ్రత్తగా పరిశీలించాల్సిన బాధ్యత డాక్టర్ కు లేదా? అని ప్రశ్నించింది. ఇది ముమ్మాటికీ డాక్టర్ నిర్లక్ష్యమేనని స్పష్టం చేసింది. ఆపరేషన్ సమయంలో రోగి కడుపులో ఏదైనా మర్చిపోతే, అది కచ్చితంగా వైద్యుల అశ్రద్ధ కిందికే వస్తుందని తేల్చి చెప్పింది. 8 లక్షల రూపాయలే కాకుండా ఆ మొత్తం డబ్బుకు 9 శాతంతో 12 ఏళ్ల వడ్డీ కూడా చెల్లించాలని ఆదేశించింది.

  • Loading...

More Telugu News