: చంద్రబాబు సతీమణికి శస్త్ర చికిత్స... రేపు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్


ఈ రోజు ఉదయం తన నివాసంలోని జిమ్ లో వ్యాయామం చేస్తూ ప్రమాదవశాత్తు కింద పడిన ఘటనలో, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి భువనేశ్వరి మణికట్టు విరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, ఆమెకు ఈ మధ్యాహ్నం శస్త్ర చికిత్స నిర్వహించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం కుదుటపడుతోంది. రేపు ఆమెను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసే అవకాశం ఉంది. భువనేశ్వరి 6 వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని, మరో 6 వారాల ఫిజియోథెరపీ చేయించుకోవాలని వైద్యులు సూచించారు.

  • Loading...

More Telugu News