: టీఆర్ఎస్ లో ఉన్నా... వారు టీడీపీ ఎమ్మెల్యేలే!


అధికారంలో ఏ పార్టీ ఉంటే అందులోకి జంప్ చేయడం ప్రతిపక్ష పార్టీ నేతలకు సర్వసాధారణం. అందునా సొంత పార్టీ అధికారంలో లేకపోవడంతో తమకేమి ఒరగదని చాలా మంది ఎమ్మెల్యేలు పార్టీలు మారుతుంటారు. విభజన నేపథ్యంలో టీఆర్ఎస్ అధికారంలోకి రావడంతో ఒక్కసారిగా చాలామంది ఎమ్మెల్యేలు గులాబీ కండువా కప్పుకున్నారు. అందులో తలసాని శ్రీనివాస్ యాదవ్ (ప్రస్తుతం టీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రి), తీగల కృష్ణారెడ్డి, ధర్మారెడ్డి కూడా ఉన్నారు. ఇదిలాఉంటే, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఈ రోజు అసెంబ్లీ కార్యదర్శి కార్యాలయం ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు జాబితా విడుదల చేసింది. అందులో తలసానిని టీడీపీ ఎమ్మెల్యేగా పేర్కొంది. ఆయనతో పాటు కృష్ణారెడ్డి, ధర్మారెడ్డిల పేర్లు సైతం టీడీపీ ఎమ్మెల్యేలుగానే పేర్కొంది. దాంతో పార్టీ ఫిరాయింపుల చట్టం వర్తించడానికి ఇదే మంచి ఆధారంగా ఉంటుందని టీ.టీడీపీ వర్గాలు భావిస్తున్నాయట.

  • Loading...

More Telugu News