: గంగూలీపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు: అనురాగ్ ఠాకూర్


టీమిండియా డైరక్టర్ గా రవిశాస్త్రి స్థానంలో సౌరవ్ గంగూలీని తీసుకుంటారని మీడియాలో విస్తృతంగా ప్రచారమవుతోంది. గంగూలీని సలహా సంఘం చైర్మన్ గా తీసుకుంటారా?... లేక, హై పెర్ఫార్మెన్స్ మేనేజర్, టీమ్ డైరక్టర్, చీఫ్ కోచ్ గా తీసుకుంటారా? అంటూ క్రికెట్ వర్గాల్లో ప్రస్తుతం చర్చ నడుస్తోంది. దీనిపై, బీసీసీఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ స్పందించారు. కోల్ కతాలో ఆయన మాట్లాడుతూ... గంగూలీ విషయమై బోర్డు ఇంకా నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. సౌరవ్ గంగూలీ భారత్ క్రికెట్ కు అందించిన సేవలు అమోఘమని కితాబిచ్చారు. "అతనో గొప్ప క్రికెటర్. ఏ నిర్ణయం తీసుకున్నా, భారత క్రికెట్ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే తీసుకుంటాం. గంగూలీ విషయంలో నిర్ణయం తీసుకునేందుకు కొంత సమయం పడుతుంది" అని పేర్కొన్నారు. తాను, బీసీసీఐ అధ్యక్షుడు జగ్మోహన్ దాల్మియాను కలిసేందుకు కోల్ కతా వచ్చానని ఠాకూర్ తెలిపారు. బంగ్లాదేశ్ టూర్ కు తాము ఇప్పటికే జట్టును ప్రకటించామని, కోచ్, సహాయక సిబ్బందిని కూడా త్వరలోనే ప్రకటిస్తామని అన్నారు.

  • Loading...

More Telugu News