: ఈ ఐపీఎల్ అరుదైన విన్యాసాలకు వేదిక!


ఐపీఎల్ సీజన్-8 ముగిసింది. ముంబై ఇండియన్స్ జట్టు రెండోసారి విజేతగా నిలిచి టైటిల్ ఎగరేసుకుపోయింది. అయితే ఈ ఐపీఎల్ లో కళ్లు చెదిరే విన్యాసాలతో ఆటగాళ్లు అలరించారు. ఫీల్డింగ్ పెద్దగా చేయలేరని, మైదానంలో బద్దకంగా కదులుతారని భారతజట్టుకు పేరుంది. యువ ఆటగాళ్లు దీనిని తుడిచేస్తున్నారు. ఒకర్ని మించి మరొకరు అద్భుత విన్యాసాలతో ఐపీఎల్ ప్రతిష్ఠను ఇనుమడింపచేస్తున్నారు. కేవలం ఫిల్డింగ్ విన్యాసాలతోనే పదుల సంఖ్యలో పరుగుల్ని నిరోధించారంటే ఏ స్థాయిలో ఫీల్డింగ్ చేశారో అంచనా వేయవచ్చు. జాన్ టీ రోడ్స్, స్టీఫెన్ ఫ్లెమింగ్, టామ్ మూడీ, వసీం అక్రమ్ వంటి వెటరన్ ల సలహాలతో దేశీయ క్రికెటర్లు ఫీల్డింగ్ లో విన్యాసాలు చేయడం విశేషం. ఈ సీజన్ లో ఆల్ టైమ్ గ్రేట్ క్యాచ్ లుగా ఆరు క్యాచ్ లు నిలవడం విశేషం. బౌండరీ లైన్ దాటుతున్న బంతిని ఒకరు అడ్డుకుంటే, మరొకరు ఒడిసిపట్టుకోవడం ఈ ఐపీఎల్ లో జరిగింది. ప్రపంచ క్రికెట్ చరిత్రలో అరుదుగా జరిగే విన్యాసం ఇది. బౌండరీ దాటుతాయని భావించిన ఎన్నో బంతులను చిటికెలో అడ్డుకుని పరుగులు నిరోధించడం ఈ ఐపీఎల్ లోనే సాధ్యమైంది. బౌండరీ దాటి పోయిందనుకున్న బంతిని అమాంతం గాల్లో లేచి ఒంటి చేత్తే పట్టుకున్న విన్యాసానికి ఐపీఎల్ బోర్డు 10 లక్షల రూపాయల ప్రైజ్ మనీ ఇచ్చిందంటే విన్యాసాలు ఏ స్థాయిలో ఉన్నాయో ఊహించుకోవచ్చు.

  • Loading...

More Telugu News