: జయ కేసులో తీర్పుపై అప్పీలుకు వెళతాం: డీఎంకే


తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పుపై అప్పీలుకు వెళ్లాలని డీఎంకే పార్టీ నిర్ణయించుకుంది. ఈ మేరకు తాము అప్పీలుకు వెళుతున్నట్టు ఓ ప్రకటనలో తెలిపింది. కోర్టు తీర్పుపై అప్పీలు చేసుకునే హక్కు తమకుందని డీఎంకే నేతలు అంటున్నారు. బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి కూడా జయ కేసులో తీర్పుపై అప్పీలుకు వెళ్లే అవకాశం ఉంది. మరోవైపు, మొదట్లో అప్పీలుకు వెళతామని సంకేతాలిచ్చిన కర్ణాటక ప్రభుతం ఈ విషయంలో ఇప్పుడు మాట్లాడడం లేదు.

  • Loading...

More Telugu News