: గవర్నర్ ను కలసిన మంత్రి గంటా... ఉన్నత విద్యామండలి రికార్డులపై ఫిర్యాదు


గవర్నర్ నరసింహన్ ను ఏపీ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు రాజ్ భవన్ లో కలిశారు. 'ఏపీ ఉన్నత విద్యామండలి'కి చెందిన పలు రికార్డులను ప్రస్తుత ఏపీ ప్రభుత్వానికి ఇవ్వకపోవడంపై గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు వినతిపత్రం అందజేసినట్టు సమాచారం. ఇప్పటికే ఏపీ విద్యామండలే లేదంటూ ఉమ్మడి హైకోర్టు తీర్పివ్వడంతో మండలి భవనాన్ని, మండలి చైర్మన్ ఛాంబర్ ను టీ.విద్యా మండలి స్వాధీనం చేసుకుంది. దాంతో ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లిన విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News