: ఆ ఇద్దరు కేంద్ర మంత్రులు తమ పదవులు త్యజిస్తే సరి!: చెవిరెడ్డి


కేంద్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రకటించాలంటే కేంద్ర మంత్రులు పదవీ త్యాగం చేస్తే సరిపోతుందని వైఎస్సార్సీపీ నేత చెవిరెడ్డి భాస్కరరెడ్డి తెలిపారు. ప్రత్యేక హోదాపై విద్యార్థి జేఏసీ నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రత్యేక హోదా కావాలంటూ ఒత్తిడి పెంచి, మంత్రి పదవులు వదులుకుంటున్నామంటే కేంద్రం దిగి వస్తుందని అన్నారు. కేంద్రం ఏదంటే దానికి తలఊపడం మానేయాలని ఆయన సూచించారు. టీడీపీ నేతలు ఈ దిశగా ఆలోచిస్తే ప్రత్యేక హోదా కచ్చితంగా వస్తుందని ఆయన స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News