: చైనాలో రహస్య సమావేశానికి హాజరైన ఆఫ్ఘన్ తాలిబన్ నేతలు
ఆఫ్ఘనిస్థాన్ శాంతిదూత ఒకరు చైనాలో రహస్య సమావేశం నిర్వహించారు. గతవారం జరిగిన ఈ సమావేశానికి ఆఫ్ఘాన్ తాలిబన్ నేతలు, పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ ప్రతినిధులు, కొందరు చైనా అధికారులు హాజరయ్యారు. తాలిబన్లకు, ఆఫ్ఘన్ ప్రభుత్వానికి మధ్య చర్చల సాధ్యాసాధ్యాలను గురించి ఈ సమావేశంలో చర్చించినట్టు సమాచారం. చైనా చొరవతోనే ఈ సీక్రెట్ మీటింగ్ ఏర్పాటైనట్టు 'వాల్ స్ట్రీట్ జర్నల్' పేర్కొంది. తాలిబన్లకు, ఆఫ్ఘన్ ప్రభుత్వానికి నడుమ మధ్యవర్తిత్వం వహించేందుకు చైనా ఇటీవల ఆసక్తి ప్రదర్శిస్తోందని కూడా జర్నల్ తెలిపింది.