: ప్రత్యేక హోదాపై కేంద్రానికి టీడీపీ డెడ్ లైన్ పెట్టాలి: బొత్స డిమాండ్


ఏపీకి ప్రత్యేక హోదా రాదని తెలిసిన రాజకీయ నేతలు మాత్రం తమదైన వ్యాఖ్యలు, డిమాండ్లు చేస్తూనే ఉన్నారు. తాజాగా పీసీసీ మాజీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ స్పందిస్తూ, హోదాపై కేంద్రానికి తెలుగుదేశం పార్టీ డెడ్ లైన్ పెట్టాలని డిమాండ్ చేశారు. టీడీపీ మహానాడులో ఈ విషయంపై తీర్మానం చేసి కేంద్రంపై ఒత్తిడి తేవాలని కోరారు. 'ప్రత్యేక హోదా'పై ప్రత్యేకంగా నిర్వహించిన సదస్సులో బొత్స మాట్లాడారు. ఏడాది పాలనలో సీఎం చంద్రబాబు ప్రభుత్వం అన్నింటిలోనూ విఫలం అయిందని విమర్శించారు. 'ప్రతి పనికీ రేటు' అంటూ టీడీపీ దోపిడీకి పాల్పడుతోందని బొత్స ఆరోపించారు.

  • Loading...

More Telugu News