: చంద్రబాబుతో సింగపూర్ మంత్రి ఈశ్వరన్ భేటీ... రాజధాని మాస్టర్ ప్లాన్ అందజేత


ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఏపీ సచివాలయంలో సింగపూర్ మంత్రి ఈశ్వరన్, పలువురు అధికారులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు రూపొందించిన 219 చదరపు కిలో మీటర్ల ఏపీ రాజధాని మాస్టర్ ప్లాన్ ను బాబుకు అందజేశారని సమాచారం. అనంతరం రాజధాని బృహత్తర ప్రణాళికపై ఈశ్వరన్ నేతృత్వంలోని సింగపూర్ బృందం చంద్రబాబుతో ఉన్నత స్ధాయి సమావేశం నిర్వహించనుంది. మధ్యాహ్నం 3.30 గంటల వరకు ఈ సమావేశం కొనసాగనుంది. తరువాత బాబు, ఈశ్వరన్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించనున్నారు.

  • Loading...

More Telugu News