: నేడు బాబు చేతికి అమరావతి మాస్టర్ ప్లాన్
నవ్యాంధ్ర కొత్త రాజధాని అమరావతి మాస్టర్ ప్లాన్ ఈ మధ్యాహ్నం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతికి అందనుంది. మధ్యాహ్నం 3.30 గంటలకు జరిగే ఓ కార్యక్రమంలో సింగపూర్ మంత్రి మాస్టర్ ప్లాన్ గురించిన పూర్తి వివరాలు చంద్రబాబుకు తెలియజేయనున్నారు. అంతకంటే ముందే, ఉదయం 11 గంటల నుంచి ఉన్నత స్థాయి సమావేశానికి బాబు ఆదేశించారు. మొత్తం 219 చదరపు కిలోమీటర్ల పరిధిలో నగరం, నిర్మాణాలు ఎలా ఉండాలన్న ప్రణాళికను సింగపూర్ తయారు చేసిన సంగతి తెలిసింది. ఇదిలావుండగా, భూములు ఇచ్చిన రైతులకు సమీప గ్రామాల్లోనే భూములను పరిహారంగా ఇవ్వనున్నారు. మాస్లర్ ప్లాన్ అందజేసిన తర్వాత ఏపీ సర్కార్ ప్రజాభిప్రాయాన్ని సేకరించనుంది.