: మూడో భార్యతో సంసారానికి అడ్డమని రెండో భార్యను కడతేర్చిన కిరాతకుడు
మూడో పెళ్లి చేసుకున్న ఘనుడొకడు, రెండో భార్య అడ్డం వస్తుందని భావించి కిరోసిన్ పోసి నిప్పంటించి హతమార్చాడు. రంగారెడ్డి జిల్లా పూడూరు మండలం సోమన్ గుర్తిలో చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఉప్పరి శేఖర్ మొదటి భార్య అంజమ్మ తన కూతురుతో కలిసి ఆత్మహత్య చేసుకోగా, సునీత (30)ను రెండో వివాహం చేసుకున్నాడు. ఇటీవల పరిగిలో మరో మహిళతో పరిచయం పెంచుకొని మూడో పెళ్లి చేసుకున్నాడు. ఈ బంధానికి సునీత ఎప్పటికైనా అడ్డు రావచ్చన్న అనుమానంతో, గుట్టు చప్పుడు కాకుండా చంపేసి, ఇంట్లోనే దహనం చేశాడు. ఇంట్లో నుంచి దుర్వాసన వస్తుండడంతో గ్రామస్థులు వెళ్లి చూడగా, కాలిపోయిన సునీత మృతదేహం కనిపించింది. దీంతో ఆమె తల్లిదండ్రులు శేఖర్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.