: కేసీఆర్ విధానానికి వ్యతిరేకమన్న కోదండరాం
ఉస్మానియా యూనివర్శిటీ భూములను స్వాధీనం చేసుకుని పేదలకు ఇళ్లు కట్టిస్తామని అనడం భావ్యం కాదని, ఈ విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విధానానికి తాను వ్యతిరేకమని జేఏసీ నేత కోదండరాం వ్యాఖ్యానించారు. ‘ఓయూ భూములు కాపాడుకుందాం - భావి తరాల విద్యార్థులకు భవిష్యత్తు ఇద్దాం’ అనే నినాదంతో నవ తెలంగాణ విద్యార్థి జేఏసీ నిర్వహించిన సభలో పాల్గొన్న ఆయన వర్శిటీ భూములపై రాద్ధాంతం చెలరేగుతున్న వేళ తొలిసారిగా స్పందించారు. పేదల ఇళ్ల కోసం వర్శిటీ భూములను తీసుకోవాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. పేదలకు ఇళ్లు కట్టించాలన్న ఆలోచన మంచిదేనని, అందుకు భూ సేకరణ విషయంలో మాత్రం తప్పుటడుగులు వేయవద్దని ఆయన సలహా ఇచ్చారు.