: ఇంట్లోకి దూసుకెళ్లిన స్కార్పియో, ఏడుగురి మృతి
ఈ తెల్లవారుఝామున కర్నూలు జిల్లా చాగలమర్రి మండలం పెద్ద బోధనం గ్రామం వద్ద దారుణం జరిగింది. తిరుపతికి వెళుతున్న స్కార్పియో వాహనం ఒకటి అదుపుతప్పి జాతీయ రహదారి పక్కనే ఉన్న ఇంట్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో స్కార్పియో నుజ్జునుజ్జుకాగా, అందులో ప్రయాణిస్తున్న అందరూ మృత్యువాతపడ్డారు. వీరంతా మహారాష్ట్రలోని పుణె జిల్లా బారామతి తాలూకా వాసులుగా గుర్తించారు. ఐదుగురు స్కార్పియోలోనే మృతి చెందగా, ఆసుప్రతికి తరలిస్తుంటే ఒకరు, ఆసుపత్రికి తీసుకెళ్లిన తరువాత మరొకరు మృతి చెందారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.