: ఐపీఎల్-8లో ఏ అవార్డు ఎవరికంటే...!
ఐపీఎల్-8 తుదిపోరు ముగిసిన తరువాత ప్రజెంటేషన్ వేడుకలో పలు అవార్డులను ఆటగాళ్లకు అందజేశారు. లక్షల రూపాయల బహుమతులూ ఇచ్చారు. విజయం సాధించిన ముంబై ఇండియన్స్ జట్టుకు రూ. 15 కోట్లతో పాటు ట్రోఫీ దక్కింది. రన్నరప్ గా నిలిచిన చెన్నై జట్టుకు రూ. 10 కోట్లు లభించింది. ఫైనల్ మ్యాచ్ లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా రోహిత్ శర్మ (రూ. 5 లక్షలు), టోర్నీలో మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ గా ఆండ్రీ రస్సెల్ (రూ. 10 లక్షలు), అత్యంత వేగంగా 50 పరుగులు చేసినందుకు రస్సెల్ కు ఫాస్టెస్ట్ ఫిఫ్టీ అవార్డు (రూ. 10 లక్షలు) లభించాయి. వీటితో పాటు క్యాచ్ ఆఫ్ ద సీజన్ గా డ్వేన్ బ్రావో (రూ. 10 లక్షలు), ఎమర్జింగ్ ప్లేయర్ గా శ్రేయాస్ అయ్యర్ (రూ. 10 లక్షలు), అత్యధిక పరుగులు చేసినందుకు డేవిడ్ వార్నర్ కు ఆరెంజ్ క్యాప్ (రూ. 10 లక్షలు), అత్యధిక వికెట్లు తీసినందుకు డ్వేన్ బ్రావోకు పర్పుల్ క్యాప్ (రూ. 10 లక్షలు), అత్యధిక సిక్స్ లు కొట్టినందుకు క్రిస్ గేల్ కు మాక్సిమమ్ సీజన్ సిక్సెస్ అవార్డు (రూ. 10 లక్షలు), ఫెయిర్ ప్లే అవార్డు కింద చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు బహుమతులు అందించారు.