: ఖుష్బూ ఇక రిటైర్మెంట్ ప్రకటించినట్టే!
తమిళనాట ఖుష్బూ అభిమానుల హృదయాలు గెలుచుకుంది. గ్లామర్, నటనలో ఆమెను మించిన వారు లేరని భావించిన కోలీవుడ్ అభిమానులు ఆమెకు గుడి కట్టారు. అలాంటి నటి ఇప్పుడు 'నటన మీద దృష్టి పెట్టలేకపోతున్నాను, నటనకు స్వస్తి చెబుతా'నని అంటున్నారు. రాజకీయాల్లో ప్రవేశించిన ఖుష్బూ, కాంగ్రెస్ కీలక నేతగా వ్యవహరిస్తున్నారు. పార్టీకి జవసత్వాలు సమకూర్చేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు. దీంతో సినిమాలు, పార్టీ వ్యవహారాలను సమన్వయం చేయలేనని, సినిమాలు ఒప్పుకుని నిర్మాతలను ఇబ్బంది పెట్టదలుచుకోలేదని ఖుష్బూ తెలిపారు. ఇక సినీ జీవితానికి ముగింపు పలికే సమయం వచ్చినట్లేనని ఆమె స్పష్టం చేశారు.