: ఆ గెలాక్సీ 300 ట్రిలియన్ సూర్యుల కాంతితో సమానం


నాసా శాస్త్రవేత్తలు అంతరిక్షంలో అత్యంత శక్తిమంతమైన గెలాక్సీని కనుగొన్నారు. ఇది 300 ట్రిలియన్ సూర్యుల కాంతితో సమానమని తెలిపారు. ఈ గెలాక్సీ నుంచి కాంతి రావడానికి కారణం అక్కడ ఏర్పడిన బ్లాక్ హోల్సేనని చావో వీ శాయ్ అనే శాస్త్రవేత్త వెల్లడించారు. ఈ గెలాక్సీలోని వాయువులు ఒకరమైన డిస్క్ ఆకారంలో ఏర్పడినప్పుడు ఆల్ట్రా వయోలెట్ కిరణాలు, ఎక్స్ రే కిరణాలు విపరీతమైన కాంతి రూపంలో ప్రసరిస్తున్నాయని ఆయన తెలిపారు. ఈ గెలాక్సీని వైట్ ఫీల్డ్ ఇన్ఫ్రారెడ్ సర్వే ఎక్స్ ప్లోరెల్ గా పిలుస్తున్నారు. ఈ గెలాక్సీ భూమికి 12.5 బిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో ఉందని ఆయన వెల్లడించారు.

  • Loading...

More Telugu News