: చెల్లెలి ఇంటికి తొలిసారి వెళ్తున్న సల్లూభాయ్...ధూమ్ ధామ్ గా ఏర్పాట్లు
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ తన చెల్లెలు అర్పితా ఖాన్ ఇంటికి తొలిసారి వెళ్తున్నాడు. వారి వివాహం తరువాత హిమాచల్ ప్రదేశ్ లోని మండి పట్టణంలో ఏర్పాటు చేసిన రిసెప్షన్ కు సల్లూ హాజరవుతున్నాడు. ఈ నేపథ్యంలో సల్లూభాయ్ ను ప్రత్యేక అతిథిగా ఆహ్వానిస్తూ హెలికాప్టర్ పంపేందుకు హిమాచల్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. సల్మాన్ చెల్లెలు అర్పితా ఖాన్ ఆ రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి అనిల్ శర్మ కోడలు. దీంతో ఆయుష్, అర్పిత రిసెప్షన్ ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ విందుకు సుమారు పది వేల మంది హాజరుకానున్నారు. ఈ వేడుకను ధామ్ గా పిలుస్తారు. దీనికి సల్మాన్ ఫ్యామిలీ మొత్తం హాజరుకానుంది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ బిజీ కారణంగా హాజరు కావడం లేదు. 'ధామ్' వేడుకలో వచ్చిన అతిథులందరిని నేలపై కూర్చోబెట్టి ఆకులో భోజనం పెడతారు. ఈ రుచికరమైన భోజనం నాలుగు దశల్లో పూర్తవుతుంది.