: నిబంధనల ప్రకారమే అఫ్జల్ గురును ఉరితీశాం: సుశీల్ కుమార్ షిండే


నిబంధనల ప్రకారమే అఫ్జల్ గురును ఉరితీశామని కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే తెలిపారు. అఫ్జల్ ఉరితీతపై ఒమర్ అబ్దుల్లా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై సుశీల్ కుమార్ ముంబైలో మాట్లాడుతూ, అఫ్జల్ గురుకు సుప్రీంకోర్టు ఉరిశిక్ష విధించిందని, అనంతరం ఆయన పెట్టుకున్న క్షమాభిక్షను రాష్ట్రపతి తిరస్కరించారని ఆయన గుర్తు చేశారు. గడువు ముగియడం, నిబంధనలు వర్తించడంతో అతనిని ఉరితీశామని ఆయన స్పష్టం చేశారు. అఫ్జల్ గురు ఉరితీత వెనుక ఎలాంటి రాజకీయ కారణాలు లేవని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News