: బిగ్ బీని కూడా 'నకిలీ' వదల్లేదు
బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ను కూడా నకిలీల బెడద వదల్లేదు. తన పేరిట ఎవరో నకిలీ ట్విట్టర్ ఖాతా తెరిచి పోస్టులు పెడుతున్నారని ఆయన అభిమానులకు తెలిపారు. ఆ ఫేక్ ట్విట్టర్ ఖాతాలో తాను టిక్ చేసిన గుర్తులేదని సూచించారు. ఫ్యాన్స్ దీనిని గుర్తించాలని ఆయన చెప్పారు. ఈ ఫేక్ ఖాతా ద్వారా వచ్చే పోస్టింగ్ లకు తనకు సంబంధం లేదని, అభిమానులు వాటిని నమ్మవద్దని ఆయన స్పష్టం చేశారు. ఈ నకిలీ ఖాతాలో (@srbachannc) తన పేరు చివర 'సీ' అనే అక్షరం అదనంగా ఉందని ఆయన అభిమానులకు తెలిపారు.