: ప్రధాని పిలుపుకన్నా ముందే ఆ గ్రామం మేల్కొంది


ప్రతి ఇంటికీ బ్యాంకు అకౌంట్ అన్న ప్రధాని పిలుపుకు స్పందించి బ్యాంకులు ఉచిత అకౌంట్లు ఇస్తున్నాయి. అయితే ప్రధాని పిలుపుకు ముందే ఓ గ్రామం మేల్కొంది. ప్రధాని పిలుపునిచ్చేనాటికే ఆ గ్రామంలోని ప్రతి ఇంటికీ బ్యాంకు అకౌంట్ ఉండడం విశేషం. ఈ గ్రామం తెలంగాణలో ఉండడం మరో విశేషం. నిజామాబాద్ లోని బస్వన్నపల్లి గ్రామంలో ప్రతి ఇంటికీ బ్యాంకు అకౌంట్ ఉంది. కూరగాయలు పండించి జీవనోపాధి పొందుతున్న గ్రామస్థులు సంపాదించిన ప్రతి పైసా పొదుపు చేస్తే భవిష్యత్ బాగుంటుందని భావించారు. ఈ మేరకు పంచాయతీ పెద్దల సలహాతో ఎస్బీహెచ్ లో అకౌంట్లు తీసుకుని పొదుపు చేయడం ఆరంభించారు. సంపాదించినది ఎంతైనా ప్రతి నివాసానికి బ్యాంకు అకౌంట్ ఉండడంతో ఆ గ్రామం వార్తల్లో నిలిచింది.

  • Loading...

More Telugu News