: అందుకే మోదీకి తగ్గింది...రాహుల్ కు పెరిగింది: ఒమర్ అబ్దుల్లా
విదేశీ పర్యటనల్లో గత ప్రభుత్వాలను అవమానిస్తూ ప్రధాని చేసిన వ్యాఖ్యల కారణంగా ఆయపై గౌరవ భావం తగ్గిందని జమ్మూకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా చెప్పారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, అదే సమయంలో కొన్ని రోజులు అజ్ఞాతంలోకి వెళ్లిన రాహుల్ గాంధీ పదునైన విమర్శలు చేస్తూ ఆకట్టుకుంటున్నాడని అన్నారు. స్వదేశంలో ప్రతిపక్షాలపై విమర్శలు చేసే మోదీ, విదేశాల్లో కూడా అలాంటి విమర్శలే చేసి, దేశంలో తాను మాత్రమే గొప్ప అనే భావానికి బీజం వేస్తున్నారని, అలాంటి వ్యాఖ్యల కారణంగా ఆయన గౌరవం తగ్గిందని ఒమర్ స్పష్టం చేశారు. అదే సమయంలో ఎన్నో విమర్శలు ఎదుర్కొన్న ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సెలవు తరువాత మెరుగుపడ్డాడని తెలిపారు. అందరినీ ఆకట్టుకుంటున్నాడని ఆయన అభిప్రాయపడ్డారు.