: ఏపీలో ఎండ దెబ్బకు మూడు గంటల్లో 17 మంది మృతి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎండ దెబ్బకు ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ ఉదయం 8 నుంచి 11 గంటల మధ్య ఎండ దెబ్బకు 17 మంది మృతి చెందినట్టు తెలుస్తోంది. ఒక్క విజయనగరం జిల్లాలోనే ఆరుగురు మృతి చెందారు. నెల్లూరు జిల్లాలో ముగ్గురు, కృష్ణా, కడప, ప్రకాశం జిల్లాల్లో ఇద్దరేసి, చిత్తూరు, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో ఒకరు చొప్పున మరణించినట్టు సమాచారం. కాగా, రాజమండ్రిలోని సెంట్రల్ జైలులో ఆరుగురు ఖైదీలకు వడదెబ్బ తగిలింది. వీరికి జైలులోని ఆసుపత్రిలో చికిత్స చేసినా ఫలితం లేకపోవడంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరో రెండు మూడు రోజులు రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.