: గంగను అపవిత్రం చేస్తున్న ఫైవ్ స్టార్ హోటల్ సీజ్


గంగానదిలోకి కలుషితాలను వెదజల్లుతూ అపవిత్రం చేస్తున్న హరిద్వార్ లోని ఐదు నక్షత్రాల హోటల్ 'రాడిసన్ బ్లూ'పై ఉత్తరాఖండ్ ప్రభుత్వం కొరడా ఝళిపించింది. రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డు అధికారులు హోటల్ ను సీజ్ చేసినట్టు వివరించారు. ఎన్ జీటీ (నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్) నిబంధనలకు విరుద్ధంగా కలుషితాలను నదిలోకి వదులుతున్నందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని అధికారులు తెలిపారు. పది రోజుల క్రితం నోటీసులు ఇచ్చినా హోటల్ యాజమాన్యం తన పద్ధతిని మార్చుకోలేదని, అందువల్ల హోటల్ ను సీజ్ చేశామని వివరించారు. కాగా, గంగానదిని కాలుష్య రహితంగా మార్చాలన్న కృత నిశ్చయంతో మోదీ సర్కారు పలు నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News