: ఆ దుర్మార్గుడు తండ్రే... 'ఆటో డ్రైవర్లంటూ' కట్టుకథ అల్లాడు!


రంగారెడ్డి జిల్లాలో పదమూడేళ్ల బాలికపై అత్యాచారం, హత్య మిస్టరీని పోలీసులు ఛేదించారు. ఆటో డ్రైవర్ సహా నలుగురు వ్యక్తులు తన కుమార్తెను ఎత్తుకుపోయి, సామూహిక అత్యాచారానికి పాల్పడి హత్య చేశారని ఆ తండ్రి చెప్పిందంతా కట్టుకథని పోలీసులు స్పష్టం చేశారు. ఈ దారుణానికి పాల్పడింది కన్న తండ్రేనని పోలీసులు తేల్చారు. ఈ ఘటనపై 30 మందిని విచారించిన పోలీసులు, ఎలాంటి ఆధారాలు లభ్యం కాకపోవడంతో అతని తండ్రిని విచారించారు. పొంతనలేని కథనాలు చెబుతున్న తండ్రి మెగావత్ కమల్ ను విచారించడంతో, బంట్వారం మండలం బారువా తండా వద్ద కుమార్తెపై అత్యాచారం, హత్య చేసి, ఆ దారుణాన్ని మరొకరిపైకి మళ్లించడానికి, తన తలకు గాయం చేసుకున్నట్టు కమల్ అంగీకరించాడని పోలీసులు తెలిపారు.

  • Loading...

More Telugu News