: రాజధాని భూమి పూజకు మోదీని ఆహ్వానించాలని నిర్ణయించాం: చంద్రబాబు


ఆంధ్రప్రదేశ్ రాజధాని భూమి పూజకు ప్రధానమంత్రి నరేంద్రమోదీని ఆహ్వానించాలని నిర్ణయించినట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. రాజధాని నిర్మాణానికి జూన్ 6 ఉదయం 8.49 నిమిషాలకు భూమి పూజ జరుగుతుందని చెప్పారు. విజయదశమి నుంచి రాజధాని పనులు ప్రారంభిస్తామని మీడియా సమావేశంలో వెల్లడించారు. అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేస్తామన్న చంద్రబాబు, చరిత్రలో చేయనంత అభివృద్ధిని కర్నూలుకు చేస్తున్నానని పేర్కొన్నారు. ఈ జిల్లాకు విరివిగా పరిశ్రమలు వస్తున్నాయని తెలిపారు. ఉభయగోదావరి జిల్లాల ప్రజలకు తనపై అపార నమ్మకం ఉందన్నారు. పట్టిసీమపై ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా గోదావరి ప్రజలు నమ్మలేదన్నారు. పార్టీ కోసం కష్టపడిన వారిని తప్పకుండా ఆదరిస్తామని ఈ సందర్భంగా చెప్పారు. రాష్ట్రంలో పరిస్థితిపై ప్రత్యేకంగా మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. గ్రామాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. ఎప్పటికప్పుడు టీవీలు, పేపర్ల ద్వారా ప్రచారం కల్పిస్తున్నామని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

  • Loading...

More Telugu News