: జమ్మూ కాశ్మీర్ సరిహద్దుపై సమీక్ష నిర్వహించిన రక్షణ మంత్రి
జమ్మూ కాశ్మీర్ సరిహద్దు వద్ద ఉన్న నియంత్రణ రేఖ వెంబడి కేంద్ర రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ పర్యటించారు. ఈ సందర్భంగా, సరిహద్దులో రక్షణ స్థితిగతులపై సమీక్ష నిర్వహించారు. ప్రధానంగా రాజౌరీ-పూంచ్ సెక్టార్ లో చొరబాట్లు జరగకుండా గట్టి చర్యలు చేపట్టాలని పారికర్ సూచించారు. పారికర్ వెంట ఆర్మీ చీఫ్ జనరల్ దల్బీర్ సింగ్ సుహాగ్, నార్త్ కమాండ్ లెఫ్టినెంట్ జనరల్ చీఫ్ డీఎస్.హుడా తదితరులు ఉన్నారు. రక్షణ మంత్రిగా పారికర్ బాధ్యతలు తీసుకున్న తర్వాత కాశ్మీర్ సరిహద్దులో ఆయన పర్యటించడం ఇదే తొలిసారి.