: సెలీనా జైట్లీ గెంటేయలేదు: సన్నీలియోన్
బాలీవుడ్ నటి సెలీనా జైట్లీ తనను ఇంటి నుంచి వెళ్లిపొమ్మని చెప్పలేదని శృంగారతార సన్నీ లియోన్ తెలిపింది. చాలా కాలం క్రితం రేగిన వివాదంపై సన్నీ ఇన్నాళ్లకు వివరణ ఇచ్చింది. సెలీనా జైట్లీ ఇల్లు లీజు ముగియడంతో ఖాళీ చేశానని చెప్పింది. కాగా, అప్పట్లో కెనడా నుంచి ముంబైలో దిగిన సన్నీ లియోన్ కి సెలీనా జైట్లీ ఇంటిని అద్దెకిచ్చింది. కొన్నాళ్లు అంతా బాగానే ఉన్న దశలో వారిద్దరి మధ్య వివాదం రేగిందని, దాంతో సన్నీని సెలీనా ఇల్లు ఖాళీ చేయమందని, అందుకే సన్నీ ఆ ఇల్లు ఖాళీ చేసి, జూహూలో మరో ఇల్లు చూసుకుందని వార్తలు వెలువడ్డాయి. దీనిపై వీరిద్దరినీ అడిగినా అప్పట్లో స్పందించలేదు. ఇల్లు ఖాళీ చేసిన ఏడాదికి ఇప్పుడు సన్నీ స్పందించడం విశేషం.