: టీఆర్ఎస్ తో కలసి పనిచేసే అవకాశం లేదు: బీజేపీ
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆహ్వానిస్తే కేంద్ర ప్రభుత్వంలో చేరే అంశంపై పార్టీలో చర్చిస్తామంటూ టీఆర్ఎస్ ఎంపీ కవిత చేసిన ప్రకటనపై బీజేపీ వ్యతిరేకంగా స్పందించింది. టీఆర్ఎస్ తో చేతులు కలిపే అవకాశం లేదని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు స్పష్టం చేశారు. 2019లో జరిగే సార్వత్రిక ఎన్నికలతో పాటు తెలంగాణలో జరిగే అన్ని ఎన్నికల్లో ఒంటిరిగా పోటీచేసి విజయం సాధించాలని బీజేపీ పట్టుదలతో ఉందని చెప్పారు. అందుకే టీఆర్ఎస్ తో కలసి పనిచేసే అవకాశాలు ఉండవన్నారు. బీజేపీ నాయకత్వం ఆహ్వానిస్తే కేంద్ర మంత్రివర్గంలో చేరే అంశాన్ని పరిశీలిస్తామంటూ కొంతమంది టీఆర్ఎస్ నాయకులు చేస్తున్న ప్రకటనల్లో అర్థం లేదని ఉద్ఘాటించారు. ఈ మాటలతో ఎన్ డీఏ ప్రభుత్వంలో మంత్రి కావాలనుకున్న కవిత ఆశలు నీరుగారాయని చెప్పవచ్చు.