: రాజభవనం లాంటి ఇల్లు రాసిస్తా... 'గే వరుడు కావలెను' ప్రకటనకు ప్రపంచవ్యాప్త స్పందన


కొన్ని రోజుల క్రితం ముంబైకి చెందిన పద్మా అయ్యర్ తన 'గే' కుమారుడికి వరుడు కావలెను అంటూ మ్యాట్రిమోనియల్ ప్రకటన ఇవ్వడం దేశంలో సంచలనం రేపింది. ఎందుకంటే, దేశంలో ఇలాంటి ప్రకటనను మునుపెన్నడూ ఇవ్వకపోవడంతో చర్చనీయాంశం అయింది. కాగా, తన కుమారుడు హరీశ్ అయ్యర్ కు తగిన వరుడు కావాలంటూ ఆమె ఇచ్చిన ప్రకటనకు 73 మంది స్పందించారట. వారిలో అబుదాబికి చెందిన వ్యక్తి రాజభవనంలాంటి ఇల్లు రాసిస్తానంటూ ముందుకొచ్చాడట. యూకే, ఆస్ట్రేలియా, అమెరికాకు చెందిన పలువురు కూడా స్పందించారట. తమ ప్రకటన పట్ల స్పందించిన వారిలో అయ్యర్లే అధికంగా ఉన్నారని పద్మ తెలిపారు. మిగతావారిలో గుజరాతీలు, ముస్లింలు కూడా ఉన్నారని ఆమె వివరించారు.

  • Loading...

More Telugu News