: అనంతపురం జిల్లాపై చంద్రబాబుకు ఎంతో ప్రేమ: జేసీ దివాకర్ రెడ్డి
అనంతపురం జిల్లాలోని ధర్మవరంలో తెలుగుదేశం పార్టీ మినీ మహానాడు ఉత్సాహభరితంగా జరుగుతోంది. ఈ సందర్భంగా, సీనియర్ నేత, అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ, టీడీపీ అధినేత చంద్రబాబును ఆకాశానికెత్తేశారు. చంద్రబాబు దూరదృష్టి వల్లే రాయలసీమకు నీరు వచ్చిందని కొనియాడారు. ఆయన నాయకత్వంలో అనంతపురం జిల్లా సస్యశ్యామలం అవుతుందని చెప్పారు. అనంతపురం జిల్లా పట్ల చంద్రబాబుకు ఓ ప్రత్యేకమైన ప్రేమ, అభిమానం ఉన్నాయని... ప్రజల కోసం ఆయన తీసుకునే ప్రతి నిర్ణయానికి ప్రజలు మద్దతు పలికి, సహకరించాలని విన్నవించారు.