: ఖమ్మంలో బయటికొస్తే ఖతమ్... 68 ఏళ్ల తర్వాత రికార్డు స్థాయి ఉష్ణోగ్రత
తెలుగు రాష్ట్రాలలో సూర్యుడు ఉగ్రరూపం ప్రదర్శిస్తున్నాడు. తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మంలో శనివారం రికార్డు స్థాయిలో 48 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. 1947లో ఇక్కడ 47.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. తీవ్ర ఉష్ణోగ్రత నేపథ్యంలో ఖమ్మంలో అప్రకటిత కర్ఫ్యూ వాతావరణం నెలకొంది. భానుడి భగభగల కారణంగా ప్రజలు బయట తిరగాలంటేనే హడలిపోతున్నారు. అటు, ఏపీలోనూ పరిస్థితి ఇలాగే ఉంది. వడదెబ్బ కారణంగా వృద్ధులు పిట్టల్లా రాలిపోతున్నారు. చిన్నారుల పరిస్థితి దారుణంగా ఉంది.