: ఓయూ భూములపై గవర్నర్ కు రేణుకా చౌదరి, విద్యార్థి జేఏసీ ఫిర్యాదు
ఉస్మానియా విశ్వవిద్యాలయ భూములను పరిరక్షించాలని కాంగ్రెస్ పార్టీ నాయకురాలు రేణుకా చౌదరి గవర్నర్ నరసింహన్ కు ఫిర్యాదు చేశారు. రేణుకతో పాటు ఓయూ విద్యార్థి జేఏసీ సంఘాల నేతలు కూడా ఉన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ కు వారు వినతిపత్రం అందజేశారు. ఉస్మానియా ఖాళీ భూముల్లో పేదలకు ఇళ్లు కట్టించి ఇస్తామంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటన చేసిన విషయం తెలిసిందే. దానిపై విద్యార్థులు, రాజకీయ నేతల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ నేపథ్యంలోనే వారంతా ఈరోజు గవర్నర్ ను కలిశారు.