: భూకంపంతో ఉలిక్కిపడిన సొలోమన్ దీవులు
పసిఫిక్ మహాసముద్రంలోని సొలోమన్ దీవులు భూకంపంతో ఉలిక్కిపడ్డాయి. 6.8 తీవ్రతతో రెండు సార్లు భూకంపం వచ్చినట్టు అమెరికా జియాలజిస్టులు గుర్తించారు. ఆస్తి, ప్రాణ నష్టం వివరాలు తెలియరాలేదు. ఇటీవల కాలంలో ఆరు, అంతకు పైగా తీవ్రతతో భూకంపాలు ఇక్కడ తరచుగా సంభవిస్తున్నాయి. తాజా ప్రకంపనలపై హవాయిలోని పసిఫిక్ సునామీ హెచ్చరికల కేంద్రం స్పందించింది. ఈ భూకంపాల కారణంగా సునామీ ప్రమాదం లేదని తెలిపింది. అటు, జియోసైన్స్ ఆస్ట్రేలియా విభాగం కూడా ఈ భూకంపాలను గుర్తించింది.