: ఈ ప్రభుత్వ హయాంలోనే రామ మందిరం పూర్తవుతుంది: సాధ్వి ప్రాచీ


విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్ పీ) నేత సాధ్వి ప్రాచీ మీడియా ముందుకొచ్చారు. జలంధర్ లో జరిగిన బీజేపీ దళిత్ మోర్చా నేషనల్ ఎగ్జిక్యూటివ్ సమావేశంలో ఆమె మాట్లాడుతూ... అయోధ్యలో రామ మందిర నిర్మాణం త్వరలోనే ప్రారంభమవుతుందని, ఈ ప్రభుత్వ హయాంలోనే పూర్తవుతుందని అన్నారు. వీహెచ్ పీ కేంద్రీయ మార్గదర్శక్ మండల్ సమావేశంలో దీనిపై తుది నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. ఇక, సల్మాన్ ఖాన్ 'హిట్ అండ్ రన్' కేసులో వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంపై మీడియా అడగ్గా... "మాలేగావ్ పేలుళ్ల కేసులో సాధ్వి ప్రజ్ఞకు బెయిల్ నిరాకరించారు. రేప్ బాధితురాలు అరుణకు 42 ఏళ్లుగా న్యాయం జరగలేదు, ఆమె చనిపోయింది. మరి, సల్మాన్ అంత సులువుగా ఎలా బెయిల్ దక్కించుకున్నారు?" అని ప్రశ్నించారు. అంతకుముందు, సల్మాన్ కు హిట్ అండ్ రన్ కేసులో బెయిల్ మంజూరైన అనంతరం సాధ్వి ప్రాచీ మాట్లాడుతూ... ఖాన్ కాబట్టే సల్మాన్ కు త్వరగా బెయిల్ వచ్చిందని వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News