: ఆంకో-కలెక్ట్ సాఫ్ట్ వేర్ ను ఆవిష్కరించిన బాలకృష్ణ
హైదరాబాదులోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రిలో సరికొత్త సాఫ్ట్ వేర్ ప్రవేశపెట్టారు. క్యాన్సర్ చికిత్సలో తోడ్పడే ఈ సాఫ్ట్ వేర్ పేరు ఆంకో-కలెక్ట్. దీనిని ఆసుపత్రి చైర్మన్ నందమూరి బాలకృష్ణ ఆవిష్కరించారు. చెన్నై అపోలో ఆసుపత్రి మెడికల్ ఆంకాలజీ డిపార్ట్ మెంట్ డైరెక్టర్ నిమ్మగడ్డ రమేశ్ ఈ సాఫ్ట్ వేర్ ను అభివృద్ధి చేశారు. తెలుగురాష్ట్రాల్లో ఈ తరహా సాఫ్ట్ వేర్ మరే ఆసుపత్రిలోనూ లేదు. ఈ సాఫ్ట్ వేర్ ను తీసుకురావడం పట్ల బాలకృష్ణ హర్షం వ్యక్తం చేశారు. ఇది ఓ డేటా బ్యాంక్ వంటిది. చికిత్స తీరుతెన్నులను దీని సాయంతో విశ్లేషిస్తారు. కాగా, బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి సీఎన్ బీసీ, టీవీ18, ఐసీఐసీఐ లాంబార్డ్ సంస్థలు అందించే హెల్త్ కేర్ అవార్డ్-2014 లభించింది. బెస్ట్ సింగిల్ స్పెషాలిటీ హాస్పిటల్-ఆంకాలజీ విభాగంలో ఈ అవార్డు దక్కింది.