: ఆ అమ్మాయి గతంలో శ్రీశాంత్ తోనూ కనిపించిందట!


గత ఐపీఎల్ సీజన్ లో అవినీతిపై బీసీసీఐ అవినీతి నిరోధక విభాగం అధిపతి రవి సవానీ బోర్డుకు లేఖ రాశారు. అందులో పలు ఆసక్తికర విషయాలున్నాయి. లీగ్ లో నిబంధనల ఉల్లంఘన యథేచ్ఛగా జరిగిందని ఆయన వివరించారు. ఆటగాళ్ల గదుల్లో అమ్మాయిలు, కొత్త వ్యక్తులు... ఇత్యాది అంశాలను ఎత్తిచూపారు. గతేడాది మే 9న చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు చెందిన ఓ ఆటగాడి గదిలోకి రాత్రి వెళ్లిన అమ్మాయి ఉదయం బయటికి వచ్చిందని పేర్కొన్నారు. ఆ ఆటగాడిని వివరణ కోరగా... "ఆమెను నేను పెళ్లాడే అవకాశం ఉంది. నాకు అత్యంత సన్నిహితురాలు" అని చెప్పాడని సవానీ తన లేఖలో తెలిపారు. అయితే, అదే అమ్మాయి గతంలో శ్రీశాంత్ తోనూ, మరికొందరు ఆటగాళ్లతోనూ కనిపించిందని వివరించారు. ముఖ్యంగా, ఆ అమ్మాయి బెంగళూరు జట్టు ఆడే మ్యాచ్ లకు ఎక్కువగా హాజరవుతుందని పేర్కొన్నారు. కాగా, సవానీ లేఖను బోర్డు సీరియస్ గా పరిగణించిన దాఖలాలు కనిపించలేదు. ఆటగాళ్లు, ఫ్రాంచైజీల నుంచి నామమాత్ర వివరణ కోరి, ఆ విషయాన్ని అంతటితో వదిలేసింది.

  • Loading...

More Telugu News