: మావోయిస్టు కావడం నేరం కాదు...లక్ష రూపాయల పరిహారం ఇవ్వండి: కేరళ హైకోర్టు
మావోయిస్టు కావడం నేరం కాదని కేరళ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. శ్యాం బాలకృష్ణన్ అనే వ్యక్తిని మావోయిస్టుగా అనుమానించి అతడిని అదుపులోకి తీసుకున్న కేసు విచారణ అనంతరం తీర్పు ఇచ్చే సమయంలో న్యాయమూర్తి అభిప్రాయాలు వెల్లడించారు. దేశంలోని చట్టాలు ఉల్లంఘించినప్పుడు మాత్రమే అవి చట్టవ్యతిరేక కార్యక్రమాలు అవుతాయని, అప్పుడు మాత్రమే అతనిని రిమాండ్ కు పంపగలమని, అలా కాకుండా, కేవలం మావోయిస్టు అయినంత మాత్రాన అతనికి రిమాండ్ విధించలేమని స్పష్టం చేశారు. అంతే కాకుండా శ్యాం బాలకృష్ణన్కు లక్ష రూపాయలకు పైగా పరిహారం ఇవ్వాలని కూడా కోర్టు ఆదేశించింది. ఈ సందర్భంగా గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను కూడా కేరళ హైకోర్టు ఉటంకించింది.