: సోషల్ మీడియాలో కామెంట్లు అమీర్ ను సినిమా చూసేలా చేస్తున్నాయి!


సినిమా హిట్టా? ఫట్టా? అనేది తెలుసుకోవాలంటే ప్రేక్షకులు ఒకప్పుడు పాత్రికేయులు రాసే రివ్యూలపై ఆధారపడేవారు. ఆ తరువాతి కాలంలో వంద రోజుల ఫంక్షన్లను బట్టి చెప్పుకునేవారు. తదనంతర కాలంలో కలెక్షన్లను బట్టి చెప్పుకునేవారు. తరువాత తొలిరోజు టాక్, బెంచ్- క్లాస్ ఆడియెన్స్ స్పందన బట్టి తెలుసుకునే వారు. తరువాత ఆన్ లైన్ రివ్యూస్ ఆధారంగా సినిమా ఎలా ఉందో నిర్ధారించేవారు. మరిప్పుడో... సోషల్ మీడియా చెప్పేస్తోంది. థియేటర్లో సినిమా చూస్తూనే తమ అభిప్రాయం సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. దీంతో సినిమా హిట్టా, ఫట్టా? అనేది వెంటనే తేలిపోతోంది. ఈ నేపథ్యంలో బాలీవుడ్ యంగ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ నటించిన 'బాంబే వెల్వెట్' సినిమా ఇటీవల రిలీజైంది. అనురాగ్ కశ్యప్ తీసిన ఈ సినిమాపై ఎన్నో అంచనాలుండగా, రెండో రోజే థియేటర్లు వెలవెలబోయాయి. సోషల్ మీడియాలో విమర్శలు, ఎద్దేవాలు, వ్యంగ్యాలు చోటుచేసుకున్నాయి. వీటిని చూసిన బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ ఒకింత బాధపడ్డాడు. అసలు ఇలాంటి కామెంట్లు ఎందుకు చేస్తున్నారో తెలుసుకోవాలంటే సినిమా చూడడమే మార్గమని భావించి, ఈ సినిమా చూస్తానని, అలాగే 'పీకూ', 'తను వెడ్స్ మనూ 2' సినిమాలు కూడా చూస్తానని చెప్పాడు.

  • Loading...

More Telugu News