: రాజధాని భూమిపూజకు స్థలం ఖరారు!


ఏపీ రాజధాని నిర్మాణానికి వచ్చే నెల 6న శంకుస్థాపన చేయనుండడం తెలిసిందే. భూమిపూజకు ఎక్కడ అనుకూలత ఉంటుందన్న దానిపై అధికారులు, వాస్తు సిద్ధాంతులు రాజధాని ప్రాంతంలో విస్తృతంగా పర్యటించారు. చివరికి, రాజధాని ప్రాంతానికి ఈశాన్యంలో ఉన్న తాళ్లాయపాలెంను ఎంపిక చేసినట్టు సమాచారం. తుళ్లూరు మండలంలోని ఈ గ్రామం శైవ క్షేత్రంగా ప్రసిద్ధికెక్కింది. పైగా కృష్ణాతీరాన ఉండడం అదనపు అనుకూలత. అంతేగాదు, రాజధాని భూసమీకరణలో ఇక్కడి రైతుల భాగస్వామ్యమే ఎక్కువ. దీంతో, ఇక్కడే భూమిపూజ చేయాలని సర్కారు నిర్ణయించింది.

  • Loading...

More Telugu News